Nara Lokesh: నైపుణ్యాభివృద్ధికి మంత్రి లోకేష్ మరో అడుగు...! 2 d ago
ఐదేళ్లలో 20 లక్షల ఉపాధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంత యువతకు శిక్షణనిచ్చి, ఉపాధి కల్పించేందుకు మూడు సంస్థలతో సీడాప్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. డాట్ కామ్ గ్రూప్ ద్వారా 2వేల మందికి విదేశాల్లో ఉద్యోగాల కల్పన, ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా 30 వేల ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపన లక్ష్యంగా ఔత్సాహికులకు శిక్షణ, సెంచూరియన్ యూనివర్సిటీ తో 30 వేలమంది గ్రామీణ యువతకు ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు రెండేళ్లు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.